తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు రాష్ట్రంలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని జంట జలాశయాల్లో క్షణక్షణానికి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం పెరుగడంతో.. హిమాయత్ సాగర్ జలాశయం మరో రెండు గేట్లు ఎత్తనున్నట్లు జల మండలి తెలిపింది.
అయితే.. వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో రోజువారి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. కరెంటు రోజువారి వినియోగం ఈనెల 15న 25.6 కోట్ల యూనిట్లు ఉండగా… 20న అది 17.2 కోట్ల యూనిట్లకు చేరింది. ఐదు రోజుల వ్యవధిలోనే 8.4 కోట్ల యూనిట్ల మేర వినియోగం తగ్గడంతో డిస్కంలపై ఆర్థికభారం తప్పింది. ఈ నెల 15న అత్యధికంగా 12,489 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా… 21న అది కేవలం 8వేల మెగావాట్లు ఉంది.