విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదే : చలసాని శ్రీనివాస్

-

జూన్ 02, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో సీఎంలుగా వ్యవహరించారు. అయితే 2019లో ఏపీకి జగన్ సీఎం కాగా..తెలంగాణకు మాత్రం కేసీఆర్ కొనసాగారు. ప్రస్తుతం తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాభవన్ లో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలువబోతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్  మీడియాతో మాట్లాడారు.   విభజన హామీలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ కూడా రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఆలోచనలో లేవని.. కృష్ణ జలాల విషయంలో ఆంధ్రకు తీరని ద్రోహం జరుగుతుందన్నారు.

రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం కూర్చోపెట్టి పరిష్కరించవచ్చన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేయలని కేంద్రం చూస్తుందని.. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ఉక్కు శాఖ మంత్రులుగా ఉన్నారన్నారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ సహాయ మంత్రిగా వున్నారని.. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news