హైదరాబాద్లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని అశోక్‌నగర్‌లో ఆయన ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్‌లోని 6 చోట్ల, మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని చేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.