అనంతపురంలో ఎన్‌ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

-

ఏపీలో పలు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురంలో విస్తృత తనిఖీలు చేసింది. సోదాల్లో భాగంగా జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో ఆత్మకూర్‌ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ ఇంటికి ఎన్‌ఐఏ అధికారులు వెళ్లారు. ఆయన ఇంటిని అధికారులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సోహెల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోహెల్‌ ఎస్‌బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సోహెల్, అతడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news