నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో రూ.2కోట్ల నగదు గుర్తించారు. భారీగా ఆస్తులు, బంగారం ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేందర్ రెడ్డికి చెందిన 15 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ గా మహేంధర్ రెడ్డి పని చేస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలున్నాయి. పౌతీ విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీనీ ఆశ్రయించినట్టు సమాచారం. వనస్థలిపురం హస్తినాపురంలోని షిర్డీ సాయినగర్ లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు. ఆయన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎమ్మార్వో మహేంధర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.