ఊరంతా కలిసి ఒక గణపతినే ప్రతిష్టించారట..! తీర్మానంతో ఆదర్శంగా నిలిచిన గ్రామం

-

వినాయకచవితి వచ్చిందంటే.. పిల్లల నుంచి పెద్దల వరకూ కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఆ పది రోజులు హాలిడే మూడ్‌ ఉంటుంది. చిన్న ఊరైనా సరే వీధికో మండపం ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద గణపతిని పెట్టారు, ఎవరు ఎంత గ్రాండ్‌గా పూజలు చేస్తున్నారు అనే దానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. యూత్‌ అసోసియేషన్లు అయితే మాములు హడావిడి చేయరు. దేవుడు ఒక్కడే అని తెలిసి కూడా.. ఇజ్జత్‌కా సవాల్‌ అన్నట్లు ఈ పండుగ చేస్తారు. కానీ ఓ గ్రామంలో మాత్రం కేవలం ఒకే ఒక్క వినాయకుడిని పెట్టారు. ఊరంతా కలిసి ఆ గణపతని కొలిచారు. ఇలా ఊరంతా కలిపి ఒకే వినాయకుడిని పెట్టాలని తీర్మానించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

నవరాత్రులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్నం వరకు వాడవాడలా సందడి ఉంటుంది. గల్లికి ఒక వినాయకుడు దర్శనం ఇస్తాడు. కానీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి నిర్వచనం లింగారెడ్డి గూడ గ్రామ ప్రజల ఐక్యమత్యం. దాదాపు 45 ఏళ్లుగా గ్రామం మొత్తంలో ఓకే వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఓకే వినాయకుడిని ప్రతిష్టించి గణేష్ వేడుకల్లోను తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

ఊరికి ఒకే విగ్రహం పెట్టాలని మొదలైన తీర్మానాలు పలు పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. ఒకే విగ్రహం నెలకొల్పేలా స్పూర్తిని నింపుతున్నాయి. మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి 2,25,000 రూపాయలకు వేలం పాటలో లడ్డును కైవసం చేసుకున్నాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కులాల మతాలకు అతీతంగా వేడుకల నిర్వహణ అని ఏక దంతునితో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలా ఊరంతా కలిసి ఒకే విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా మంచి నిర్ణయం అని అందరూ అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది వినాయకచవితి పూర్తైంది. వినాయకుడి తమ తల్లి ఒడిలోకి చేరాడు. మళ్లీ వచ్చే సంవత్సరం వరకూ వినాయకుడి కోసం ఎదురుచూడాల్సిందే.!

Read more RELATED
Recommended to you

Latest news