రాహుల్ గాందీ.. రేవంత్ విధ్వంసాన్ని ఆపండి : ఎమ్మెల్సీ కవిత

-

హైదరాబాద్ లో గత రెండు రోజుల నుంచి భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మిట్ కి ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేసారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినందుకు ఆహ్వానిస్తున్నాను.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సందర్శించేందుకు రాహుల్ ను ఆహ్వానిస్తున్నామని.. మీ సీఎం, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం చూడండి. యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలవండి. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసాన్ని ఆపండి అని కోరారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని ఒక్కసారి చూడండి. చూస్తే.. మీకే అర్థం అవుతుంది. అసలు HCU లో ఏం జరిగిందో మీకే తెలుస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. దీనిపై మాత్రం కాంగ్రెస్ నాయకులు కొందరూ కవితకు కౌంటర్లు ఇవ్వడం విశేషం. 

Read more RELATED
Recommended to you

Latest news