దెబ్బకొట్టిన కేసీఆర్..అదానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సేవలు నిలిపివేత

-

అదానీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ బిగ్‌ షాక్‌ తగిలింది. అదానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సేవలు నిలిపివేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యా శాఖ. విద్యాంజలి 2.0 కార్యక్రమంలో భాగంగా అదానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ ఫౌండేషన్ సేవలను నిలిపివేసింది.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని డీఈఓలను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. విద్యా సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న విద్యా శాఖ.. విద్యాంజలి 2.0 కి సపోర్ట్ చేయాలని గత ఫిబ్రవరి లో deo లకు ఆదేశించింది. అయితే…. తాజాగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version