లంచం తీసికుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికారు ఇద్దరు అధికారులు. ధరణి పోర్టల్‌లో రికార్డులు తారుమారు చేసేందుకు రూ.8 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి మరియు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్.
ప్రస్తుతం భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ధరణిలో ఒక పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్. భూపాల్ రెడ్డి తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోను ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.
జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసింది ఏసిబి. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరాడు బాధితుడు. ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పారు సీనియర్ అసిస్టెంట్.