రాజాసింగ్ పిడి యాక్ట్ పై ముగిసిన అడ్వైజరీ బోర్డు విచారణ

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై అడ్వైజరీ బోర్డు విచారణ ముగిసింది. రాజాసింగ్ పై ఉన్న కేసులపై ఆరా తీసారు పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సభ్యులు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీడీ యాక్ట్ పై అడ్వైజరీ కమిటీ ముందు చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా పీడియాట్ అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు రాజాసింగ్ ను ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ పై మోపబడ్డ 40 కి పైగా కేసుల గురించి వారు ఆరా తీశారు. గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్ లో బోర్డు చైర్మన్ భాస్కరరావు, మరో ఇద్దరూ రిటైర్డ్ న్యాయమూర్తుల సమక్షంలో విచారణ కొనసాగింది. బోర్డు ముందు వెస్ట్ జోన్ డిజిపి, మంగళ్ హాట్, షాహినగర్ గంజ్ పోలీసులు హాజరయ్యారు.

పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబ సభ్యులకు కూడా విచారణకు హాజరయ్యారు. సుమారు గంటపాటు ఈ విచారణణ కొనసాగింది. పీడీ యాక్ట్ ప్రయోగం పై రాజాసింగ్ నుండి అభ్యంతరాలను తెలుసుకుంది బోర్డు . పీడీ యాక్ట్ పెట్టడానికి దారి తీసిన పరిస్థితులను బోర్డుకు వివరించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news