AEE candidates protesting near Gandhi Bhavan: గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర AEE అభ్యర్థులు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాలేదు AEE అభ్యర్థుల అంశం. తెలంగాణ మంత్రులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

ఇందులో భాగంగానే… గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు AEE అభ్యర్థులు. మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది కమిషన్. అయితే… డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వలేదు కమిషన్. లీకేజీ వల్ల ఇప్పటికే ఏడాది సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.
గురుకుల, AEE అభ్యర్థులు ఆందోళన పడకండి అంటూ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు….విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పదిహేను రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని… గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి సరి చేస్తున్నామని వివరించారు.