ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఏరియల్ సర్వే..

-

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం సంబంధించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు వద్ద కేంద్ర మంత్రులు వర్షం నష్టాన్ని పై అంచనా వేసేందుకు ఫోటో యాక్టివేషన్ ని తిలకించనున్నారు.  కేంద్రమంత్రులు శివ రాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో, ఖమ్మంలో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టం ను పరిశీలించారు.

అలాగే  పాలేరులో వర్షం, వరద వల్ల జరిగిన నష్టాన్ని రైతులతో అడిగి తెలుసుకోనున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం భారీ వర్షం రావడంతో పాలేరు ట్యాంక్ బండపై ఏర్పాటు చేసిన టెంట్లు, ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం కూలిపోయాయి. దీంతో కార్యక్రమాన్ని పాలేరు నవోదయ ఆడిటోరియంలో అధికారులు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్నారు. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news