ముమ్మాటికీ ఇది కమీషన్ల ప్రభుత్వమే.. అసెంబ్లీలో ఏలేటి సంచలన వ్యాఖ్యలు

-

ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర అప్పులపై సభలో చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ మూలధన వ్యయాన్ని తగ్గిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. బడ్జెట్ లో సూక్తి ముక్తావళి చాలా ఉందని.. వాస్తవాలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ కమీషన్ల ప్రభుత్వమేనని అన్నారు. నిధులు లేమితో అన్ని రంగాలు కుదేలు అవుతున్నాయని ఆరోపించారు.

మంత్రులు ప్రతి పనికి కమీషన్లు తీసుకుంటున్నారంటూ సచివాలయంలో కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని.. రాబోయే నాలుగేళ్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉందన్నారు. ఇప్పటికే రోజు సర్కార్ రూ.1700 కోట్లకు పైగా అప్పులు చేస్తోందని అన్నారు. నిమిషానికి రూ.కోటికి పైమాటేనని కామెంట్ చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాస్ట్ర జనాభా 3.54 కోట్లుగా తేలిందని.. ఆ లెక్కన చూస్తే అప్పుడే పుట్టిన రుణభారం రూ.2.24 లక్షలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news