ఊరు, పేరు, అంచనా మార్చి కేసీఆర్ అవినీతి : సీఎం రేవంత్ రెడ్డి

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాజెక్ట్ ను మేడిగడ్డను ఊరికి మార్చి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కు సొంత మార్పులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. అంచనాలను పెంచి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ రిపోర్టు పై అసెంబ్లీలో చర్చించి తదుపరి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy

అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. ఆగస్టు 31న పీసీ ఘోష్ కమిషన్ అందించింది. పూర్తి స్థాయిలో విశ్లేషించి.. సంక్షిప్తంగా నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్, లా సెక్రెటరీ, జీఐడీ సెక్రెటరీ లతో చర్చించి నివేదికను కేబినెట్ లో చర్చించారు. 16 నెలల తరువాత 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ అందించింది.  ఇది రాజకీయ పార్టీ నివేదికో.. ప్రభుత్వ పార్టీ నివేదికో కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక అన్నారు. ఈ నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news