వాహనదారులకు అలెర్ట్.. అలా చేస్తే.. లైసెన్స్ రద్దు

-

పాత వాహనాల నెంబర్ ప్లేట్లను మారుస్తున్న వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం TS ను TG గా మారుస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొంత మంది వాహనదారులు తమ నెంబర్ ప్లేట్ లలో TS కి బదులు TG అక్షరాలను మారుస్తున్నారు. ఈ వ్యవహారం పై స్పందించిన రవాణా శాఖ అధికారులు.. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కొత్త కొత్త వాహనాలకు మాత్రమే TG సిరీస్ వర్తిస్తుందని తెలిపారు.

ఎవరైనా పాత వాహనాలకు సొంతంగా నెంబర్ ప్లేట్ల పై స్టేట్ కోడ్ TG గా మారిస్తే.. ట్యాంపరింగ్ గా భావించి రూల్స్ ప్రకారం.. నేరంగా పరిగణిస్తామన్నారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది రవాణా శాఖ. అందుకే వాహనదారులు జాగ్రత్త పడండి. అనవసరంగా మార్చుకొని ఇబ్బందులు పడకండి. ఎలా ఉందో అలా ఉంచండి. ఎందుకు వచ్చిన లొల్లి.. మార్చి ఇబ్బందుల పాలవ్వకండి సుమా..!

Read more RELATED
Recommended to you

Latest news