అరికపూడి గాంధీకి PAC చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఏపీకి చెందిన వలస దారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి PAC ఛైర్మన్ ఎలా ఇస్తారని నిప్పులు చెరిగారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షం పంపించిన వారినే చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రేషన్ కార్డు ఇవ్వక పోవడం తో పేదలు ఇబ్బంది పడుతున్నారని… వెంటనే రేషన్ కార్డు లు ఇవ్వాలన్నారు.
పది అంశాలపై బీజేఎల్పీ సమావేశంలో చర్చించామని… రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఈ నెల 20న రైతు దీక్ష చేపడతాని హెచ్చరించారు. వరద నష్టం పై ఇప్పటి వరకు చేసిన పనులపై, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంపై కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహించారు. కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తి చేస్తామని తెలిపారు. వక్ఫ్ పై ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తుందని… ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని వివరించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.