కౌశిక్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి – హరీష్‌ రావు

-

కౌశిక్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు హరీష్‌ రావు. కౌశిక్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై హరీష్‌ రావు స్పందించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

harish rao on koushik reddy incident

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని… రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని నిప్పులు చెరిగారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని తెలిపారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని… ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news