తెలంగాణ అసెంబ్లీలో BRSLPకి గదుల కేటాయింపు జరిగింది. రూమ్ నెంబర్ 1,2 లను BRSLPకి కేటాయించింది అసెంబ్లీ సచివాలయం. గతంలో ప్రతిపక్ష నేత గాజానా రెడ్డి ,భట్టి విక్రమార్క లకు కేటాయించిన ఛాంబర్ ను తమకు కేటయించక పోవడం పై BRS నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. బిజెపి కి రూమ్ నెంబర్ 3 ,MIM కి రూమ్ నెంబర్ 4 కేటాయించారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో BRSLPకి గదుల కేటాయింపు చేయడంపై అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు వచ్చారు BRS MLA లు, ఎమ్మెల్సీలు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ కు ఛాంబర్ కేటాయింపు అంశంను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు BRS ప్రజా ప్రతినిధులు. కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ మాటలతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్న తమిళిసై.. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించారు.