తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ మాటలతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్న తమిళిసై.. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించారు.
“ప్రజాభవన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించింది. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కొత్త ఎంఎస్‌ఎంఈ విధానం ప్రకటించింది. యువకుల బలి దానాలతో తెలంగాణ ఏర్పాటైంది. ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. తెలంగాణ ఏర్పాటులో కలసివచ్చిన పార్టీలు, వ్యక్తులను ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోంది. దావోస్ సమావేశంలో రూ.40 వేల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.” అని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో పేర్కొన్నారు.