అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు

-

భారతదేశం ఎన్నో అరుదైన కళలకు పుట్టినల్లు. అలాంటి కళల్లో అత్యంత అరుదైనది కరీంనగర్‌ ఫిలిగ్రీ. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే మన దేశానికి వచ్చే విదేశీ ప్రముఖులకు ఎన్నోసార్లు కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులను బహూకరించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే తాజాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముకేశ్‌ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించడంతో దాదాపు 400 వస్తువులకు ఆర్డర్‌ చేసినట్లు కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌ కుమార్‌లు తెలిపారు. జులైలో ఈ పెళ్లి జరగనుంది. జ్యుయలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు అశోక్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news