టీఎస్‌ఆర్టీసీ ఇక టీజీఎస్‌ఆర్టీసీ.. సంస్థ ‘ఎక్స్‌’ ఖాతాల పేర్లూ మార్పు

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చిన విషయం తెలిసిందే. టీజీ నేమ్ కోడ్ మీదనే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాహనాల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ పేరును కూడా మార్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ ఆర్టీసీగా మార్చింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ ఆర్టీసీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాల పేర్లనూ మార్చింది. ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించాలని కోరింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ స్టేట్‌ (టీఎస్‌)ను, తెలంగాణ (టీజీ)గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news