కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లో ఉన్నటువంటి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కార్యకర్తలతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ కి పుష్పాంజలి ఘటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. రేపు మనం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్న వేళ.. బలమైన ఐక్యమత్యంతో కూడిన.. అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించాలనే వారి దార్శనికతకు మన నిబద్దతను పునరుద్ఘాటించారు.