కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది: అమిత్ షా

-

కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని అమిత్ షా విమర్శించారు. ‘ఉగ్రవాదులను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు.

amit shah in vikarabad meeting

ఇవాళ వికారాబాద్ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ…. అయోధ్యలో రామ మందిరం అంశాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా నాన్చుతూ వచ్చింది. మోదీ రెండోసారి PM కాగానే ఐదేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్, మజ్లీస్ నూ రాష్ట్రం నుంచి తరిమేశక్తి బీజేపీకే ఉంది’ అని వికారాబాద్ లో వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news