హైదరాబాద్ అమ్మోనియా గ్యాస్‌ లీక్..15 మందికి అస్వస్థత

-

 

హైదరాబాద్ ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీక్ అయింది. ఈ సంఘటనలో 15 మందికి అస్వస్థత అయింది. పైప్‌లైన్‌ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో చాలాకాలం నుండి పడి ఉన్నాయి రెండు అమ్మోనియా గ్యాస్‌ సిలిండర్లు. అయితే.. ఈ సిలిండర్లను గమనించిన ఓ దొంగ.. గ్యాస్‌ సిలిండర్లకున్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు.

సిలిండర్‌ వాల్వ్‌ను రాడ్డుతో కొట్టి తొలిగించబోయాడు దొంగ. ఈ తరుణంలోనే… సిలిండర్‌ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ అయింది. సిలిండర్లను పగలగొట్టి దొంగ పారిపోవడంతో.. గాల్లో 15 మీటర్లకు పైగా గాల్లో వ్యాపించింది గ్యాస్. ఇటు పక్కనే ఉన్న కంపెనీలో బీహార్ కార్మికులకు 10 మందికి అస్వస్థత, కాలనీ వాసులకు 5 గురికి అస్వస్థత అయింది. దీంతో అస్వస్థతకు గురైన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news