తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వైష్ణవి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది.
అయితే శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె.. ఇవాళ చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంటర్ విద్యార్థిని అసలు పరీక్షల భయంతో చనిపోయిందా.. లేక… ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.