హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్ర.. హైదరాబాద్ బాలికపై ‘పలుకుబడి ‘ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ఘాటుగా స్పందించారు మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా.” ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం.
ఆ యువకులు ‘పలుకుబడి ‘ఉన్న కుటుంబాలవారు కాదు. సంస్కృతి, మానవతా విలువలు లేని సరైన పెంపకం తెలియని దిగువస్థాయి కుటుంబాలవారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.” అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు ఆనంద్ మహీంద్రా. మరోవైపు వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ ఈ కేసుకు సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇద్దరిలో ఒక వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వసీవుల్లాఖాన్ కొడుకు ఖాదర్ ఖాన్, ఈయన ఫ్రెండ్ హది అని తెలిపారు.
I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1
— anand mahindra (@anandmahindra) June 3, 2022