ఆంధ్రజ్యోతి ఛానల్ కు చుక్కెదురు అయింది. ఆంధ్రజ్యోతి ఛానల్ ను నిరుద్యోగులు నిలదీశారు. తాజాగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. లైవ్ ఇవ్వనప్పుడు వీడియోలు ఎందుకు తీసుకుంటున్నారని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై మండి పడ్డారు నిరుద్యోగులు.
మీ ఛానల్ లో మా సమస్యలు చూపించడం లేదు ఇప్పుడు కూడా లైవ్ రావడం లేదని మండిపడ్డారు. మేము దాదాపు రెండు గంటల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు మీరు బైట్స్ కోసం వచ్చారు అంటూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.
అటు తెలంగాణ సీఎం రేవంత్ కు షాక్ ఇచ్చారు నిరుద్యోగులు. తమ డిమాండ్లు సాధించుకునేలా శనివారం రాత్రి నిరసనలు తెలుపుతూ… అశోక్ నగర్ అష్టదిగ్బంధనం చేశారు. అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థుల మెరుపు నిరసన తెలిపారు. గ్రూప్ 2, 3 పోస్ట్ లు పెంచి, పరీక్షలు డిసెంబర్ లో పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ…. నిన్న రాత్రిపూట నిరసనలు చేశారు. దీంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.