ఈనెల 25న తెలంగాణ బడ్జెట్.. వీటికే ప్రాధాన్యత

-

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందురు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది.  ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నెల 23న కేంద్రం పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం, 25న లేదా 27న రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్‌ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నట్లు సమాచారం. వాటికే రూ.90 వేల కోట్లకు పైగా కావాలని అంచనా. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగు నీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్‌కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుందని అధికారులు తెలిపారు. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఆ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news