ఉత్తమ అంగన్ వాడీ టీచర్ అవార్డు అందుకున్న జంగిడి కమలమ్మ ఇవాల పదవీ విరమణ సన్మానోత్సవ సభ నిర్వహించారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన అంగన్ వాడీ సెంటర్ లో దాదాపు 40 సంవత్సరాలకు పైగా అంగన్ వాడీ టీచర్ గా పని చేశారు కమలమ్మ. జూన్ 30, 2024న పదవీ విరమణ చేశారు. ఇవాళ మాజీ సర్పంచ్ ఆరేకంటి రాములు ఆధ్వర్యంలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి గ్రామం అయిన నేరేడుగొమ్ములో పదవీ విరమణ సన్మానోత్సవ సభ నిర్వహించారు.
ముఖ్యంగా జంగిడి కమలమ్మ చేసినటువంటి సేవలను అందరూ కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా అంగన్ వాడీ టీచర్ గా మంచి గుర్తింపు ఉంది కమలమ్మకు. ఎంతో మంది మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. ఆమె చేసిన సేవలు మరువలేనివి. బాల్య దశలోనే పిల్లలకు అక్షరాలు నేర్పించేది. ఆమె నేర్పించిన అక్షరాలతో ఎంతో మంది ఉన్నత స్తానంలో ఉన్నారు. పదవీ విరమణ అయిపోయినప్పటికీ ఆమె మాత్రం అంగన్ వాడీ సెంటర్ వద్దకు రావాలనుకుంటుంది. నూతన టీచర్ వచ్చే సమయం వరకు అంగన్ వాడీ టీచర్ గా కమలమ్మను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.