ఎమ్మెల్యే గూడెం దారెటు… బీజేపీవైపా లేక కాంగ్రెస్ లోకా..?

-

పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. మైనింగ్ శాఖకు 300 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టారని ఈఢీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈడీ దాడుల నేపథ్యంలో పార్టీ మారాలని మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తొలుత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న మహిపాల్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ కేడర్ అడ్డుకుంది. ఆందోల్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ గట్టిగా వ్యతిరేకించడమే గాకుండా పార్టీ అధిష్టానాన్ని కూడా అతన్ని చేర్చుకోవద్దని కోరారు. దీంతో గాంధీభనన్ గేట్లు క్లోజ్ కాగా చేసేదేమి లేక మహిపాల్ రెడ్డి బిజెపిలోకి చేరాలని యోచిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

మహిపాల్ రెడ్డి సోదరుడు ఇటీవల మైనింగ్ కేసులో జైలు పాలయ్యాడు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఈడీ తెరిపించి చూసింది. యాక్సిస్ బ్యాంకు నుంచి కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి పై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మహిపాల్ రెడ్డి అక్రమ సంపాదనపై ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. మైనింగ్ శాఖకు బకాయిపడ్డ కేసులో ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ కేసులో మహిపాల్ రెడ్డి జైలు పాలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ , బిజెపి పెద్దలను వేర్వేరుగా కలుస్తున్నారు.

మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన బంగారానికి రసీదులు లేవు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి అక్రమ ఆస్తులను కూడబెట్టిన ఆరోపణలు మహిపాల్ రెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పునరావాసం కోసం బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జహిరాబాద్ బిజెపి మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో మహిపాల్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరాలంటే మహిపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బిజెపి అధిష్టానం కండిషన్ పెట్టినట్టు భోగట్టా. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారా.. లేక ఎలాగోలా సీఎం రేవంత్ ని మెప్పించి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news