- ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్రీట్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా నిలబడిందని నొక్కి చెప్పారు. సీఎం తన ఎక్స్ ఖాతాలో ఏం పోస్ట్ చేశారంటే..? పాలమూరూ రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్దండపూర్ రిజర్వాయర్ పరిధిలో నిర్వాసితులుగా మారి .. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి కన్నీళ్లు సాక్షంగా మిగిలిన బాధితులకు అండగా నిలిచాము. అధికారంలోకొస్తే పరిహారం ఇచ్చి కన్నీళ్లు తుడుస్తామన్న హామీని నిలబెట్టుకున్నాము. ఏడాదిన్నరలో రూ. రెండు వందల కోట్లు పరిహారం మంజూరు చేసాం. ఇందులో 25 కోట్లు గత నెలలో విడుదల చేశామని.. ఈ నెలలో మరో రూ. 175 కోట్లు విడుదల చేశామని రాసుకోవచ్చారు.
ఈ నేపథ్యంలో నిర్వాసితులతో సహపంక్తి భోజనం చేసి.. డిసెంబర్ 9 లోపు పరిహారం అందిస్తామని నా మాటగా చెప్పాల్సిందిగా జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డికి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు 6000 మందితో సహ పంచ్చి భోజనం చేసి.. నా హామీ మేరకు వారికి భరోసా ఇచ్చిన అని రుద్ రెడ్డి కి నా అభినందనలు” అని ఎక్స్ ఖాతాలో రాశారు సీఎం రేవంత్ రెడ్డి.