హైదరాబాదులో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

-

హైదరాబాదులో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌ ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోగా.. ఇవాళ మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు.

Another auto driver died in Hyderabad

అయితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నప్పటికీ… కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే…హైదరాబాదులో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భయ్యాలాల్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ అనిల్ కుమార్ (26) ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news