కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరికల పర్వం ఊపందుకుంది. ఇటీవలనే కీలక నేతలు దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, కేకే, కడియ శ్రీహరి, కడియం కావ్యాలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పకున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. అయితే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు ఢిల్కీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం.. మరోవైపు కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరుతుండటంతో బీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. అయితే ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటు వేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలో తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఆసక్తిని రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version