BREAKING : హైదరాబాద్ లో మరో ఘోర అగ్ని ప్రమాదం

-

BREAKING : హైదరాబాద్ లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ అలం ఫిల్టర్ సమీపంలోని ప్లాస్టిక్ గోదాం లో మంటలు ఎగసి పడుతున్నాయి. దీంతో తుక్కు కోసం వినియోగించే రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి.

దట్టమైన పొగలతో స్థానికులు…ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలోనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్నాయి రెండు ఫైర్ ఇంజన్ లు, అగ్నిమాపక సిబ్బంది. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పుతోంది ఫైర్‌ సిబ్బంది. అటు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news