తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు మరో గుడ్‌న్యూస్

-

తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు మరో గుడ్‌న్యూస్. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. వారు 61 ఏళ్ల వరకు పని చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల 58 ఏళ్ళు నిండిన 23 మంది కాంట్రాక్టు లెక్చరర్ లను, మినిమం టైం స్కేల్ అధ్యాపకుడిని ఇంటర్ విద్యాశాఖ తొలగించింది.

దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా వారిని విధుల్లోకి తీసుకోవాలని మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీంతో ఇంటర్ విద్యాశాఖ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 79,205 మంది టీచర్లు బదిలీ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న కాఫీని డీఈఓ ఆఫీసులో రేపటి లోపు అందిస్తే… దానిని పరిశీలించి ఈనెల 8, 9న సీనియారిటీ ప్రకారం లిస్ట్ ను రెడీ చేసి వెబ్సైట్ లో పెడతారు. ఈనెల 15 హెచ్ఎంలకు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news