రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ‘ధరణి’ని రద్దు చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఆదిశగా అడుగులు వేస్తోంది. దీని స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి ఆ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు అప్పగించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ధరణి సైట్ ను చూస్తున్న విదేశీ కంపెనీ టెర్రాసిస్ కాన్ఫ్రాక్ట్ ను రద్దు చేయనుంది. CGG ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు పోర్టల్స్ నిర్వహణను చూస్తోంది. కాగా, ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభలలో దరఖాస్తుల ద్వారా వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తాం. ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.