రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు మరో లేఖ..కారణం ఇదే

-

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు మరో లేఖ రాశారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం గురించి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు మరో లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని…. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు హరీష్‌ రావు.

Another letter from Harish Rao to CM Revanth Reddy

రేవంత్‌ మాటను నమ్మి తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదని ఆగ్రహించారు. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. ఈ తరుణంలోనే.. రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నానని తెలిపారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news