నేడు మరో అల్పపీడనం…ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్ !

-

ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ఎన్టీఆర్ఎర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Another low pressure today red alert for AP, Telangana

అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.. 40కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌, ఉత్తర తెలంగాణ, ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అటు ఐదు రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం ఉంది. ఆలయం వద్ద గర్భగుడిలోనికి వెళ్తున్నది మంజీరా వరద. అమ్మవారి ఆలయం ముందు మంజీరా ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఆలయం మూసివేశారు.  రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు అర్చకులు.

Read more RELATED
Recommended to you

Latest news