తెలంగాణ రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరొక అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీ ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను హార్వర్డ్ కోరినది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి తీసుకున్న చర్యలు, టర్బో ఛార్జింగ్ ఇండియా అనే అంశాలపై మాట్లాడాలని హార్వర్డ్ యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది.
ఈ సదస్సులో ఆయన ప్రాతినిథ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా నిర్వాహకులు తెలపగా.. మంత్రి కేటీఆర్ సైతం అదే ఉత్సాహాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈనెల 20న జరగనున్న సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.