RAPO20 : యాక్షన్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్

-

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మ‌రో సినిమాకు సిద్ధం అవుతున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అందుకున్న త‌ర్వాత రామ్.. రెడ్ సినిమా చేశాడు. కానీ అది ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. దీని త‌ర్వత ప్ర‌స్తుతం వారియ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ప‌వ‌ర్ ఫుల్ పోలీసు ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పూర్తి విడుద‌ల కాక‌ముందే.. మ‌రో సినిమాకు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

యాక్షన్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రామ్ అంగీక‌రిచాడు. ఈ విషయాన్ని హీరో రామ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఎంతో ఎగ్జైటింగ్ ఉన్నాను. యాక్షన్ సినిమాల‌కు బాపు లాంటోడు.. బోయ‌పాటి తో సినిమా చేస్తున్నాను. అని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం RAPO 20 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. అలాగే ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల‌లో తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news