Breaking : ఏక్ మినీ క‌థ హీరోయిన్ కావ్యా థాప‌ర్ అరెస్ట్

-

తెలుగులో ఏక్ మినీ క‌థ అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించిన కావ్యా థాప‌ర్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్ కావ్యా థాప‌ర్ గురువారం ఉద‌యం మ‌ద్యం సేవించి.. కారు నడిపింది. అంతే కాకుండా ఒక వ్యక్తికి కారుతో ఢీ కొట్టింది. దీంతో ఆ వ్య‌క్తి తీవ్రంగా గాయ ప‌డ్డాడు. అప్పుడు ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు వ‌స్తే.. వారితో వాగ్వివాదం చేసుకుంది. ప‌లువురు పోలీసులపై హీరోయిన కావ్యా థాప‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేసింది.

అంతే కాకుండా ఒక పోలీసు అధికారి కాల‌ర్ ను కూడా ప‌ట్టుకుంది. దీంతో హీరోయిన్ కావ్యా థాప‌ర్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. అంతే కాకుండా జుహూ పోలీస్ స్టేషన్ కు హీరోయిన్ కావ్యా థాప‌ర్ ను త‌ర‌లించారు. అనంత‌రం.. అమెను అంధేరి కోర్టులో పోలీసులు హాజ‌రు ప‌ర్చారు. కోర్టులో వాద‌న‌లు విన్న జ‌డ్జ్.. హీరోయిన్ కావ్యా థాప‌ర్ ను విచార‌ణ కోసం జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డికి విధించారు. కాగ హీరోయిన్ కావ్యా థాప‌ర్ తెలుగు లో ఏక్ మీని క‌థ అనే సినిమాలో న‌టించి.. తెలుగు గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news