తెలంగాణ రైతులకు మరో షాక్‌..ఇకపై పంటలు వేశాకే రైతు బంధు ?

-

తెలంగాణ రైతులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇకపై పంటలు వేశాకే…రైతు బంధు ఇవ్వనున్నారట. 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన ఉందట.

Another shock to the farmers of Telangana

గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేయనున్నట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు అనడంతో.. కొంత మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. దీంతో గందరగోళానికి లోనవుతున్నారు రైతులు. కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన 2 లక్షల రుణ మాఫీ ఉత్త మాటేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news