ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి అవుతా – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి అవుతానంటూ సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి కార్యకర్తలు కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ డిసిషన్ అనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

komatireddy rajgopal reddy on minister post

ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నదని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని తప్పిదాల వల్లే 64 ఎమ్మెల్యేలు గెలిచారని ఇంకాస్త మెరుగ్గా పని చేసి ఉంటే 80 ఎమ్మెల్యేలు గెలిచేవారన్నారు. ఒక వేళ పార్టీ సర్వే ప్రకారం.. తన భార్యకు టికెట్ ఇవ్వాలని భావిస్తే పోటీ చేస్తామన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇస్తే బాగుంటుందన్నారు. మా అన్నదమ్ముళ్లను విడదీసే కుట్ర జరుగుతోందని కోమటిరెడ్డి బ్రదర్స్ ను విడదీయడం అసాధ్యం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news