నేను అప్రూవర్ గా మారలేదు – అరుణ్ రామచంద్ర పిళ్ళై

-

నేను అప్రూవర్ గా మారలేదని బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు అరుణ్ రామచంద్ర పిళ్ళై. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారారని వస్తున్న వార్తలను ఖండించారు అరుణ్ రామచంద్ర తరఫున న్యాయవాదులు. తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులు.

Arun Ramachandra Pillai about liquor case
Arun Ramachandra Pillai about liquor case

సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిలై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు అంటున్నారు న్యాయవాదులు. తప్పుడు వార్తలు కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు న్యాయవాదులు.

కాగా, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ తరుణంలోనే.. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరుగనుంది. ఈ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

 

Read more RELATED
Recommended to you

Latest news