ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

-

YS Jagan Mohan Reddy : ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్‌ కాలేజ్‌ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్‌. ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కానున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కానున్నాయి.

CM YS Jagan's visit to Vizianagaram district today
CM YS Jagan’s visit to Vizianagaram district today

ఈ మేరకు విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు సీఎం వై.ఎస్. జగన్. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించనుంది ఏపీ ప్రభుత్వం. రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇక ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news