తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎక్కువ వార్తలు ఉన్న విషయం హైడ్రా. హైదరాబాద్ నగరంలో హైడ్రా వరుస కూల్చివేతలు చేప్పట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కూల్చివేతలపై తాజాగా MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ హైడ్రాకు చట్టబద్ధత లేదు అని నేను అలాగే మా పార్టీ కార్పొరేటర్లు అందరం కలిసి మేయర్ అలాగే చీఫ్ సెక్రెటరీ వద్దకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ.. హైదరాబాద్ లో ఎంతో పాపులర్ అయిన నెక్లెస్ రోడ్ FTL పరిధిలో ఉంది.. కాబట్టి దాని కూల్చేయండి అని అన్నారు. అలాగే ప్రస్తుతం GHMC ప్రధాన కార్యాలయం ఉండే చోట ఓ నీటి కుంట ఉండేది. నేను స్కూల్ కు వెళ్లే సమయంలో దాని పక్క నుండే వెళ్లే వాడిని. కాబట్టి ఆ GHMC ఆఫీస్ ను కూడా కూల్చాలి అన్నారు. అదే విధంగా హిమాయత్ సాగర్ వద్ద ఉన్న సెంట్రల్ కు సంబంధించిన సీసీఎంబి ఆఫీస్ FTL పరిధిలో ఉంది.. దాని కూడా కూల్చేస్తారా అని ఓవైసీ ప్రశ్నించాడు.