సిద్దిపేట జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో రఘునందన్ రావు కీలక కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్తున్నారు అని పేర్కొన్నారు. అయితే ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఈ వర్ష కాలంలో దోమల వల్ల రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి పోయాయి అని తెలిపారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలోని ఆసుపత్రులను సందర్శించాలి అని అన్నారు.
అదే విధంగా చెరువులు కబ్జా చేస్తే ఎవరిపై అయినా సరే చర్యలు తీసుకోండి కానీ.. హైడ్రా పేరుతో అసలు విషయం పక్కకు పోతుంది అని పేర్కొన్నారు. అలాగే వెంటనే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని.. ఒకవేళ ఎన్నికలు తొందరగా నిర్వహించకపోతే రాష్ట్రానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతాయి అని తెలిపారు రఘునందన్.