రేవంత్‌ రెడ్డి కాదు.. RSS అన్న – ఓవైసీ సంచలనం

-

రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘మైనారిటీ డిక్లరేషన్’ పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అసదుద్దీన్ “ఈ కాంగ్రెస్ సదన్ కు నేటి నుంచి కొత్త పేరు పెట్టాలి…. అదేంటంటే ‘ఆర్ఎస్ఎస్ అన్నా’.

Asaduddin Owaisi on revanth reddy

హైదరాబాద్ లో కొత్త నగరాన్ని నిర్మిస్తామని, హైదరాబాద్ డిక్లరేషన్ చేస్తామని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి మన ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది” అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ‘మైనారిటీ డిక్లరేషన్’ ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మైనారిటీల ఆర్థిక అభ్యున్నతి, సాధికారత కోసం తమ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version