కొన్ని సార్లు మనసును చంపుకొని పని చేయాల్సి వస్తోంది : హైడ్రా కమిషనర్ రంగనాథ్

-

ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లు విలేజ్ మ్యాప్ లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. `అమీన్ పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లనే లే అవుట్లు మునిగాయన్నారు. ఎఫ్టీఎల్ లెవెల్ పరిగణలోకి తీసుకొని చెరువులు సర్వే చేయిస్తామని తెలిపారు.

తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లవైనా పేదలపైనా కూల్చక తప్పదన్నారు. కొంతమంది పై చర్యలు తీసుకోవడం వల్లనే హైడ్రా చేసే పని అందరికీ తెలిసిందన్నారు. ప్రజల్లోFTL, బఫర్ జోన్ల పై అవగాహన వచ్చిందన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే.. సమాజమంతా బాధపడాల్సి వస్తుందని.. కొన్ని సార్లు మనస్సును చంపుకొని పని చేయాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్.

Read more RELATED
Recommended to you

Latest news