అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. కాంగ్రెస్ నాయకులకు అల్లు అర్జున్ అభిమానుల బెదిరింపు కాల్స్

-

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నాయకులకు అల్లు అర్జున్ అభిమానుల బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంటి పై దాడి చేసినందుకు అల్లు అర్జున్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని బెదిరింపు కాల్స్ చేశారు.  తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు.  చంపేస్తామని అల్లు అర్జున్ మనుష్యులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు.  తన అనుచరులతో ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దే అంటూ హెచ్చరిక జారీ చేశారు.  తమ నంబర్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.  తమకు ఫోన్ కాల్స్ ఆగకపోతే.. వేల మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం అంటూ అల్లు అర్జున్‌ను బెదిరించారు కాంగ్రెస్ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news